: మానవ తప్పిదంతోనే సింధురత్నలో ప్రమాదం
ఐఎన్ఎన్ సింధురత్న జలంతర్గామిలో ప్రమాదానికి మావన తప్పిదమే కారణమని విచారణ కమిటీ తేల్చినట్లు సమాచారం. ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పాటించకపోవడంతోనే కేబుళ్లలో మంటలు లేచి పొగలు వ్యాపించినట్లు కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు నౌకాదళ అధికారులు ఊపిరాడక మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. అనంతరం ప్రమాదానికి బాధ్యత వహిస్తూ నౌకాదళాధిపతి దేవేందర్ కుమార్ జోషి రాజీనామా కూడా చేశారు.