: మీడియా ప్రతినిధులకు కౌంటర్ విసిరిన ములాయం


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలో నేడు మీడియా ప్రతినిధులపై కౌంటర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ల సమ్మెతో రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా, 'మీ ఇంట్లో ఎవరైనా వైద్యం అందక చనిపోయారా?' అని ప్రశ్నించారు. దీంతో, ఆ మీడియా ప్రతినిధి అవాక్కయ్యాడు. మీడియా సవ్యరీతిలో వార్తలు రాస్తే డాక్టర్ల సమ్మె దానంతటదే ఆగిపోతుందని ములాయం పేర్కొన్నారు. వైద్యుల సమ్మెను ఎందుకు భూతద్దంలో చూపుతారని ఆయన మీడియాను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News