: నాకు, బావకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు: బాలకృష్ణ
టీ కప్పులో చెలరేగిన తుపానును ఆపేందుకు సినీ నటుడు బాలకృష్ణ రంగంలోకి దిగారు. తమ అభిమాన కథానాయకుడికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆయన అభిమానులు చేస్తున్న ఆరోపణలు, నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, ఈయన మాట్లాడుతూ... తనకు, బావ (చంద్రబాబు)కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. లెజెండ్ ఆడియో ఫంక్షన్ లో అభిమానులు గొడవ చేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆహ్వానించలేదని తెలిపారు. ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని... ఆడియో ఫంక్షన్ లో ఎలాంటి గొడవ చేయరాదని విన్నవించారు. బాబుకు, బాలయ్యకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని టీడీపీ నేతలు కూడా తెలిపారు.