: ప్రధాని పదవికి నాకంటే అర్హులెవరు?: నితీశ్


తానూ ప్రధాని రేసులో ఉన్నానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చాటుకున్నారు. పైగా, ప్రధానమంత్రి పదవి స్వీకరించడానికి తనకంటే అర్హులెవరున్నారని ప్రశ్నిస్తున్నారు. బెట్టియాలో 'సంకల్ప్ యాత్ర' సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో ప్రధాని పదవి కోసం వెంపర్లాడుతున్న వారికంటే నేను ఎన్నో విధాలా అర్హుణ్ణి. ఒకరికి (మోడీ) పార్లమెంటు అనుభవం లేదు, మరొకరికి (రాహుల్) రాష్ట్రాన్ని నడిపించిన అనుభవం లేదు. వారిద్దరికంటే నేను తీసిపోయానా...? రెండు విధాలా నేను అనుభవజ్ఞుణ్ణే' అని వ్యాఖ్యానించారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో నితీశ్ జేడీ (యూ) పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News