: 2023 నాటికి బిలియనీర్ల దేశంగా భారత్


ప్రపంచంలో బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాబోతోంది. 2023 నాటికి బిలియనీర్లు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుందని అంచనా. వచ్చే దశాబ్దం నాటికి సంపద సృష్టి ఆ స్థాయిలో అభివృద్ధి చెందనుందని 2014 వెల్త్ రిపోర్ట్ పేర్కొంటోంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలో మన దేశంలో అత్యంత సంపన్నులు 60 మంది ఉన్నారని, 2023 నాటికి ఈ సంఖ్య 119కి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా, చైనా, రష్యా తరువాతి స్థానం భారత్ ఆక్రమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లతో పోలిస్తే భారత్ ముందుంటుందని నివేదిక పేర్కొంటోంది.

  • Loading...

More Telugu News