: రేపట్నుంచి టీటీడీలో సిఫారసు లేఖలు రద్దు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావడంతో, దాని ప్రభావం టీటీడీపై కూడా పడింది. రేపట్నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు మెంబర్ల సిఫారసు లేఖలు చెల్లవని టీటీడీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు సిఫారసు లెటర్లతో ఇష్టానుసారం శ్రీవారి దర్శనం చేసుకున్న వారు... ఇకపై క్యూలైన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, సొంత బోర్డు మెంబర్ల సిఫారసు లేఖలు కూడా చెల్లవని టీటీడీ ప్రకటించడం చర్చనీయాంశమైంది.