: కిరణ్ పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనుకుంటున్నా: డొక్కా


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందేమోనన్న అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కిరణ్ పార్టీ పెట్టేవారైతే ఎప్పుడో పెట్టేవారని, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరుగుతుందన్న భయంతో ఒకవేళ పార్టీ పెట్టవచ్చని డొక్కా పేర్కొన్నారు. అంతేగాక కిరణ్ 5 నుంచి 10వేల కోట్లు సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని మీడియాతో అన్నారు. చివరి ఆరు నెలల పాలనా కాలంలో కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించాలని గవర్నర్ ను కోరానని, తన శాఖకు సంబంధించిన నిర్ణయాలపైన సమీక్షించమని కోరినట్లు తెలిపారు. పదవి అడ్డు పెట్టుకుని తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.

  • Loading...

More Telugu News