: ఐపీఎల్ ఇండియాలోనే...మే నెలలో ఐపీఎల్ ప్రారంభం
ఐపీఎల్ 7ను భారత్ లోనే నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 7 కు రక్షణ కల్పించలేమని కేంద్ర హోం మంత్రి షిండే స్పష్టం చేయడంతో... ఈ సీజన్ ను సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఊహించిన బీసీసీఐ, ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో మే నెలలో భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయించిందని సమాచారం. అయితే మే నెల మొదటి వారంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండడం కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. మే మొదటి వారానికి ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో బీసీసీఐకి అనుకూలంగా మారింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానాలు ఖాళీగా ఉండడంతో మే మొదటి వారం నుంచి ఐపీఎల్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకు ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు జరిగే ఐపీఎల్ 7 షెడ్యూలును రేపు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేయనున్నారు.