: కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పనున్న ఎంఐఎం
ఇంతకాలం కొనసాగిన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల దోస్తీకి తెరపడనుంది. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో... కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తులో ఎలాంటి సంబంధాలు ఉండబోవని బొత్సకు అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చే సోమవారం హైదరాబాద్ మేయర్ పదవికి తమ అభ్యర్థి మాజిద్ హుసేన్ రాజీనామా చేస్తారని తెలిపారు. ఇరు పార్టీల సహకారంతో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుసేన్ హైదరాబాద్ మేయర్ పదవిని అధిరోహించిన సంగతి తెలిసిందే.