: బాబుకు ఇంతవరకు అందని 'లెజెండ్' ఆడియో ఫంక్షన్ ఆహ్వానం
తెలుగుదేశం పార్టీకి సరికొత్త సమస్య వచ్చిపడింది. పార్టీ అధినేత చంద్రబాబుకు ఇదొక తలనొప్పి వ్యవహారంలా పరిణమించింది. ఈ సమస్య జంప్ జిలానీలతో రాలేదు, బంధువులతో రాలేదు... బాలకృష్ణ అభిమానులతో వచ్చి పడింది. పార్టీలో తమ అభిమాన కథానాయకుడు బాలయ్యకు మంచి స్థానం ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న బాలకృష్ణ 'లెజెండ్' ఆడియో ఫంక్షన్ కు ఇంతవరకు బాబుకు ఆహ్వానం అందలేదు. సాధారణంగా బాలయ్య ప్రతి ఫంక్షన్ కు చంద్రబాబే ముఖ్య అతిథిగా ఉంటారు. బాలయ్యకు పదవి ఇవ్వకపోతే ఇకపై జరిగే టీడీపీ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉంటామని అభిమానులు హెచ్చరిస్తున్నారు.