: బీజేపీలోకి పురంధేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ఈ రోజు విశాఖపట్నంలోని తమ అనుచరులు, నేతలతో దగ్గుబాటి దంపతులు సుదీర్ఘ మంతనాలు కొనసాగించారు. అనంతరం, బీజేపీలో చేరాలని వారు నిర్ణయించారు. రేపు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో దగ్గుబాటి దంపతులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. పురంధేశ్వరి నిర్ణయంతో విశాఖ రాజకీయాలు వేడెక్కాయి.