: అమితాబ్ కు పది మిలియన్ల లైక్స్!


సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, సమాజంలోని పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఫేస్ బుక్ లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య పది మిలియన్ల (కోటి మంది)కు చేరింది. దానిపై బిగ్ బి స్పందిస్తూ, 'వావ్... పది మిలియన్ల లైక్స్' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తన ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య పది మిలియన్లకు చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

  • Loading...

More Telugu News