: జడేజా స్పిన్ ఉచ్చులో ఆఫ్ఘన్ విలవిల
పసికూన ఆఫ్ఘనిస్తాన్ తో ఆసియా కప్ పోరులో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా రెచ్చిపోయాడు. టాస్ గెలిచి ఆఫ్ఘన్ కు బ్యాటింగ్ అప్పగించిన కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ, జడేజా బంతిని గింగిరాలు తిప్పాడు. ఓ దశలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసిన ఆఫ్ఘన్ ఆ తర్వాత వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 19 ఓవర్లలో 5 వికెట్లకు 78 పరుగులు. జడేజా మూడు వికెట్లు తీశాడు.