: రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాలి: ఎర్రబెల్లి
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వారం రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లోగా నష్టపరిహారం ఇవ్వకుంటే గవర్నర్ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.