: మాంసం, పాలు, జున్నుతో ముందే మరణం!


చికెన్ తింటున్నారా..? సిగరెట్ తాగితే కేన్సర్ తో పోయే ప్రమాదం ఎలా ఉందో.. చికెన్ తినేవారికీ అంతే ముప్పు ఉంటుందని దక్షిణ క్యాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. మాంసం ద్వారా వచ్చే ప్రొటీన్లను నడి వయసులో అధికంగా తీసుకునే వారు కేన్సర్ తో మరణించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 50ఏళ్లు దాటిన 6,318 మందిపై అధ్యయనం చేసి వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా ప్రొటీన్ పదార్థాలను అధికంగా ఇష్టపడి తిన్నవారు ఎక్కువ శాతం (ఇతరులతో పోలిస్తే) మరణించడం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

డయాబెటిస్ వ్యాధి బారినపడి మరణించే అవకాశాలూ ఎక్కువగానే ఉంటాయని వీరంటున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, పాలు, జున్ను వంటి వాటిని ఎక్కువగా తీసుకునే వారికి ఈ ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, 65 ఏళ్లు దాటిన వారు సాధారణ స్థాయిలో ప్రొటీన్ పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి మేలు చేస్తున్నట్లు పరిశోధనలో తేలిన విషయం. సోయాబీన్స్ వంటి వాటి ద్వారా లభించే ప్రొటీన్లతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడైంది.

  • Loading...

More Telugu News