: 'జురాసిక్ పార్క్ 4' లో ఇర్ఫాన్ ఖాన్?


హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్ కు మరో సీక్వెల్ రాబోతోంది. 'జురాసిక్ పార్క్ 4' గా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ 'అవును, జురాసిక్ పార్క్ 4 సినిమా కోసం నన్ను సంప్రదించారు. కానీ, ఈ సమయంలో ఎలాంటి వివరాలు చెప్పలేను' అని అన్నాడు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ పోషించేది విలన్ పాత్ర కాదని అంతర్జాతీయ మీడియా తెలుపగా, ఇలాంటి అవకాశాలు అంగీకరించి రిస్క్ తీసుకోకూడదని ఇర్ఫాన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒప్పుకున్న పలు బాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో హాలీవుడ్ ప్రాజెక్టు కుదరకపోవచ్చని... కాబట్టి, వదులకోవడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ ను స్టీవెన్ స్పీల్ బెర్గ్ నిర్మిస్తున్నాడు.

  • Loading...

More Telugu News