: ఇక అమెరికాలో విమాన ప్రయాణం గాలిలో దీపం!
విమానాలు ల్యాండింగ్ అవ్వాలన్నా, టేకాఫ్ తీసుకుని నింగికెగరాలన్నా గ్రౌండ్ కంట్రోలింగ్ వ్యవస్థ, అధికారులు తప్పనిసరి కదా. కానీ, ఆర్థిక ఇబ్బందులున్నాయని అమెరికాలో ఇప్పడు నియంత్రణ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించారు. అన్ని విమానాశ్రయాలలోనూ కాదు. కేవలం 149 చిన్న విమానాశ్రయాలలో మాత్రమే.
ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా సర్కారు అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ర్టేషన్ (జాతీయ విమాన నియంత్రణ సంస్థ)కు నిధుల కేటాయింపులలో సుమారు 3200కోట్ల రూపాయల కోత పెట్టింది. కనుక గత్యంతరం లేక వ్యయాలను తగ్గించుకునేందుకు వచ్చే నెల నుంచి 149 విమానాశ్రయాలలో నియంత్రణ కేంద్రాలను ఎత్తివేయాలని ఈ సంస్థ నిర్ణయించింది.
ఇప్పడు విమానాల ల్యాండింగ్, టేకాఫ్ లను విమానాశ్రయం నుంచి ఎవరూ నియంత్రించరు. పైలట్లే జాగ్రత్తగా వాటిని దింపి, తీసుకెళ్లాలి. దీనివల్ల ఎప్పుడైనా ప్రమాదాలకు ఆస్కారం లేకపోలేదు.