: కిరణ్ జీవోలపై గవర్నర్ దృష్టి
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి చివరి రోజుల్లో ఇచ్చిన జీవోలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. పదవీకాలం ముగిసిపోతుందని తెలియడంతో ఆయన చాలా వాటికి అనుమతులు ఇచ్చారని, అవన్నీ అక్రమ అనుమతులని కాంగ్రెస్ నేతలంతా విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో గవర్నర్ నరసింహన్ కిరణ్ కుమార్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్న సురేందర్ ను సహకారశాఖ సహాయ రిజిస్టార్ గా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. సురేందర్ ను మాతృసంస్థ ఏపీఐఐసీకి బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.