: ఒబామా లేకుండా చైనా పర్యటనకు వెళ్లనున్న మిషెల్లే
అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడి సతీమణి మిషెల్లే ఒబామా చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల చివర్లో ఆమె చైనాకు వెళ్లనున్నారు. అయితే, ఆమె వెంట ఒబామా మాత్రం వెళ్లడంలేదు. మిషెల్లే తన తల్లి మారియన్ రాబిన్సన్, ఇద్దరు కూతుర్లు మాలియా, సాషాతో కలిసి వారం పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న వీరు బీజింగ్ చేరుకుంటారు. 23 వరకు అక్కడే ఉంటారు. 24న గ్జియాన్, 25, 26 తేదీల్లో చెంగ్డులో పర్యటించనున్నారని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. పర్యటనలో భాగంగా మిషెల్లే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సతీమణి మడామే పెంగ్ తో భేటీ అవుతారు. అలాగే, బీజింగ్ లో యూనివర్సిటీ, హైస్కూల్ విద్యార్థులతో సమావేశమవడంతోపాటు, పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారని వైట్ హౌస్ వెల్లడించింది.