: ఆంధ్రప్రదేశ్ విడిపోయినా సీఐఐ ఒకటిగానే ఉండాలి: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినా సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) ఒకటిగానే ఉండాలని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. రెండు రాష్ట్రాలను సమన్వయం చేసే బాధ్యత సీఐఐ తీసుకోవాలని చెప్పారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా సీమాంధ్ర వారేనని పేర్కొన్నారు. హైదరాబాదు దేశానికే గర్వకారణమన్న జైరాం దాని అభివృద్ధి వల్లే మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండదని, 3, 4 ఏళ్లలో సీమాంధ్ర రాజధానిని అభివృద్ధి చేస్తారని విశాఖలో మాట్లాడిన మంత్రి అన్నారు. అయితే రాష్ట్రం విడిపోయినంత మాత్రాన దళితులకు అన్యాయం జరగదన్నారు. గురుద్వార ప్రాంతం సమీపంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన దళిత సమాఖ్య సమావేశానికి హాజరయిన జైరాం, దళితుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. అయితే, వారికి రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. సీమాంధ్రలో మెడికల్, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.