: 86 పెట్రోలు బంకులు దోచేస్తున్నాయి: తూనికలు కొలతల శాఖ


నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సర్ వేన్ రిమోట్లను వాడుతున్న పంపులపై కేసులు నమోదు చేశామని తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, పెట్రోలు బంకుల యజమానులు సమ్మెకు దిగడం సరికాదని హితవు పలికారు. వినియోగదారులను దోచేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని, దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిబంధనలను పాటిస్తే కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయిల్ కంపెనీల పేర్లు చెప్పి పెట్రోలు డీలర్లు తప్పించుకోవాలని చూస్తున్నారని, నాణ్యతా ప్రమాణాలు అందరూ పాటించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 86 పెట్రోలు బంకులపై కేసులు నమోదు చేశామని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News