: ఆరు భాషల్లో రజనీకాంత్ 'కొచ్చడయాన్'
నటుడు రజనీకాంత్ నటిస్తున్న 'కొచ్చడయాన్' చిత్రం ఆరు భాషల్లో విడుదలవబోతోంది. తమిళ, తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్ పురి, మరాఠీ భాషల్లోకి డబ్ చేసి వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈ చిత్రం యూనిట్ తెలిపింది. భారతీయ సినిమా చరిత్రలో ఒకేసారి ఇన్ని భాషల్లో ఓ సినిమా రానుండటం ఇదే తొలిసారి. రజనీకాంత్ చిన్న కుమార్తె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె కథానాయిక. పూర్తి త్రీడీ మోషన్ పిక్చర్ టెక్నాలజీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.