: అవును, అతను నా కొడుకే: ఎన్డీ తివారీ
పితృత్వ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ ఎట్టకేలకు దిగివచ్చారు. డీఎన్ఏ పరీక్ష తరువాత కూడా శేఖర్ ను తన తనయుడే కాదని తివారీ ఇన్నాళ్లూ బుకాయించారు. ఇప్పుడు తివారీ మాట మార్చారు. ‘‘శేఖర్ నా కొడుకే’’ అని ఆయన అంగీకరించారు. తండ్రి కోసం కోర్టు మెట్లెక్కిన అతనికి సమాజంలో తగిన గౌరవం దక్కనుంది.