: పార్టీ గుర్తులపైనే మున్సిపల్ ఎన్నికలు: రమాకాంత్ రెడ్డి
పార్టీల ప్రాతిపదికనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థులు పార్టీల గుర్తులపై పోటీ చేస్తారని వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలకు ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. మార్చి 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని... మార్చి 18వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. మొత్తం 10 కార్పొరేషన్లు, 146 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మిగిలిన చోట్ల కొన్ని ఇబ్బందులు, కోర్టు కేసులు ఉన్నందున వాటికి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 11 వేల ఈవీఎంలు వాడనున్నట్టు రమాకాంత్ రెడ్డి తెలిపారు.