: నేడు మయన్మార్ వెళ్లనున్న ప్రధాని
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు మయన్మార్ వెళుతున్నారు. అక్కడ రెండు రోజుల పాటు జరగనున్న బీఐఎంఎన్ టీఈసీ సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధానిగా ఆయనకు ఇదే చివరి పర్యటన కావడం విశేషం. బంగాళాఖాతం తీర దేశాలు వివిధ రంగాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా పరస్పరం సహకరించుకోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ కూటమిలో భారత్, థాయ్ లాండ్, శ్రీలంక, మయన్మార్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలు ఉన్నాయి.