: గవర్నర్ తో డీజీపీ భేటీ
రాష్ట్ర గవర్నర్, పాలనా అధినేత నరసింహన్ తో డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. నిన్న రాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గవర్నరే ఇకపై అన్ని రకాల పాలనా వ్యవహారాలు చూడనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున శాంతి భద్రతలు తదితర అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.