: అంబరీష్ కు సింగపూర్ లో చికిత్స ప్రారంభం
శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న నటుడు, కర్ణాటక రాష్ట్రమంత్రి అంబరీష్ ను మెరుగైన చికిత్స నిమిత్తం సింగపూర్ కు తరలించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 6.30 గంటలకు ఆయనను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స ప్రారంభించారు. అంబరీష్ వెంట ఆయన సతీమణి సుమలత, కుమారుడు అభిషేక్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఉన్నారు.