: చంద్రబాబుపై హత్యాయత్నం కేసు నిందితుడు సుదర్శన్ అరెస్టు
సంచలనం సృష్టించిన అలిపిరి ఘటనలో చంద్రబాబుపై హత్యాయత్నం కేసులో కీలక నిందితుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుదర్శన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా వైరా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నసుదర్శన్ ను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్టు అగ్రనేత అయిన సుదర్శన్ పై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు ప్రకటించింది. హోంమంత్రి మాధవరెడ్డి హత్య కేసులోనూ సుదర్శన్ కీలక నిందితుడు కావడం గమనార్హం. ఒడిషాలోని మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ అపహరణ కేసులో కూడా సుదర్శన్ నిందితుడే.