: ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.. పోలీసులు అరెస్ట్ చేశారు


భావాలను స్వేచ్ఛగా, వేగంగా పంచుకునే సదాశయంతో నెలకొల్పిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పోస్టులు కొందరికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్ బుక్ ను ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, తప్పుడు ప్రచారాలకు కొందరు వాడుకోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. తాజాగా ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఘర్షణకు దారి తీసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. నైనిటాల్ జిల్లా రామ్ నగర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

ఓ మత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా యువకుడు కొన్ని ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దాంతో ఓ మతానికి చెందిన ప్రజలు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం రాత్రి వీధుల్లోకి వచ్చారు. వారు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని అడిషనల్ డీజీ రామ్ సింగ్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరిగాయని ఆయన అన్నారు. ఫేస్ బుక్ లో 26 ఏళ్ల రాజీవ్ అనే వ్యక్తి ఫోటోలు ఉంచినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News