: రాహుల్ పైనుండి ఊడిపడ్డాడు: మోడీ


కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చూడబోతే రాహుల్ అంగారక గ్రహం నుంచి వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలకు ఏ దేశంలోనూ స్థానం ఉండరాదని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, సాధికారతపై రాహుల్ అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వాజ్ పేయి హయాంలో మహిళలు ఎంతో సురక్షితంగా ఫీలయ్యారని తెలిపారు. ప్రస్తుతం గుజరాత్ లోని స్త్రీలు కూడా భద్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. అదే ఢిల్లీలో మహిళలపై క్రైమ్ రేట్ 70 శాతం ఉండగా, గుజరాత్ లో 50 శాతం కంటే తక్కువగానే ఉందని వివరించారు. కర్ణాటకలోని హుబ్లీ వద్ద ఓ సభలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News