: లంక చేతిలో ఓటమిపై కోహ్లీ స్పందన


ఆసియా కప్ లో శ్రీలంకతో మ్యాచ్ ను చేజార్చుకున్న టీమిండియా నిరుత్సాహంలో మునిగిపోయింది. రెండు వికెట్ల తేడాతో ఓటమి చవిచూడడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తెలివైన క్రికెట్ ఆడడంలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డాడు. టాస్ కీలకమే అయినా అది అదృష్టంతో కూడుకున్నదని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లను కలిగి ఉన్నా పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయామని వివరించాడు. కొన్ని అంపైర్ల నిర్ణయాలు టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చాయని వెల్లడించాడు. దాంతోపాటు కొన్ని క్యాచ్ లు జారవిడవడం కూడా ఫలితంపై ప్రభావం చూపిందని ఈ యువ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News