: మా నాన్నకు బికినీ షాట్ గురించి తెలుసు: సోనమ్ కపూర్
'బేవకూఫియా' సినిమాలో తాను చేసిన బికినీ షాట్ గురించి తన తండ్రి అనిల్ కపూర్ కి తెలుసని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపింది. ముంబైలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి కూడా నటుడైనందువల్ల బికినీ షాట్ గురించి ఏమీ అనలేదని అన్నారు. తనను సినిమాల్లో ప్రోత్సహించేది తన తండ్రే అని సోనమ్ తెలిపింది. తానెప్పుడూ బరువు పెరగడం తగ్గడం చేస్తుంటానని, ఇందుకోసం తాను పెద్దగా కష్టపడనని సోనమ్ తెలిపింది. సినిమాలో సంతకం చేసేటప్పుడే బికినీ షాట్ గురించి తెలుసని, ఎలాగూ సన్నగానే ఉన్నాను కనుక బికినీకి ఒప్పుకున్నానని సోనమ్ తెలిపింది. బేవకూఫియాలో టూ పీస్ బికినీలో సోనమ్ కనువిందు చేయనుంది. సోనమ్ కపూర్ హాట్ హాట్ గా ఉందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.