: డిన్నర్ కొస్తావా... పది కోట్లిస్తా... మోడల్ కి బంపరాఫర్!


పది కోట్లు ఇస్తామంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేసి దేనికైనా రెడీ అంటారు. కానీ, పది కోట్లను గడ్డిపరకగా భావించిన ఆ మోడల్ బంపరాఫర్ ను తోసిపుచ్చి, తన ఔన్నత్యాన్ని చాటుకుంది. ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచానికి రారాణిలా వెలిగిన క్లాడియా షిఫర్ కి అరబ్బు యువరాజు ఒక్క సాయంత్రం తనతో గడిపితే పది కోట్ల రూపాయలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చారని ఆమె లండన్ లో వెల్లడించింది.

అయితే తనకు ఇలాంటి ఆఫర్లు ఆయన ఒక్కరే ఇవ్వలేదని, చాలా మంది ఇలాంటి ఆఫర్లు ఇచ్చారని, అయితే అరబ్బు యువరాజు ఇచ్చిన ఆఫర్ మాత్రం కళ్లు తిరిగేదని ఆమె చెప్పింది. అయితే తాను దానిని తిరస్కరించానని, వేరే మోడల్ మాత్రం అతనితో గడిపిందని క్లాడియా షిఫర్ తెలిపింది.

  • Loading...

More Telugu News