: 25 ఏళ్ల వరకు సీమాంధ్రలో కాంగ్రెస్ ఉండదు: కోడెల


రాష్ట్ర విభజన విషయంలో మొండిగా వ్యవహరించిన కాంగ్రెస్ పై టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. సీమాంధ్రలో మరో 25 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రసక్తే ఉండదని, ఈ మాట ఆ పార్టీ నేతలే అంటున్నారన్నారు. ఏకపక్షంగా విభజన చేసిన పార్టీ సీమాంధ్రలో మట్టికొట్టుకు పోయిందన్నారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ దుష్ట పాలనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పదేళ్ల పాటు పోరాటం చేశారని చెప్పారు. ఈ పోరాటంలో అనేకమంది టీడీపీ నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. టీడీపీ శ్రేణులకు ఇబ్బంది లేని విధంగా పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలు ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News