: కేంద్ర హోంమంత్రి షిండేకు మాజీ సైన్యాధిపతి లీగల్ నోటీసు
బీజేపీలో చేరబోతున్న మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ కేంద్ర హోంమంత్రి షిండేకు లీగల్ నోటీసు పంపించారు. 2012 జనవరిలో ఆర్మీ బలగాలు ఢిల్లీవైపు కదులుతున్నాయని, తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ ప్రచారం సాగింది. ఇలా తనపై వ్యతిరేక ప్రచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనందుకు సింగ్ ఈ లీగల్ నోటీసు పంపారు. నిందితులతో అనుబంధం వల్లే చర్యలు తీసుకోలేదా? అని ప్రశ్నించారు.