: సికింద్రాబాద్ లోక్ సభ సీటుపై ఎంఐఎం కన్ను
వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ సికింద్రాబాద్ సీటుపై కన్నేసింది. ఈ మేరకు అక్కడి నుంచి ఎంఐఎం పోటీ చేస్తుందని ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ వారాసిగూడలో జరిగిన మైనార్టీ సభలో పాల్గొన్న అసదుద్దీన్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీని నిలువరించడం ద్వారానే దేశంలో ముస్లింలు స్వతంత్రంగా జీవించగలుగుతారని పేర్కొన్నారు.