: సింగపూర్ సిటీతో బాబుకున్న సంబంధమేమిటి?: గట్టు
సీమాంధ్ర ప్రాంతాన్ని సింగపూర్ మాదిరి తయారుచేస్తానని పదే పదే చెబుతున్న చంద్రబాబు, సింగపూర్ సిటీతో ఉన్న సంబంధమేమిటో బయటపెట్టాలని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని ఆయన విమర్శించారు.
చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, దుబాయ్ మూడు కళ్లులాంటివని గట్టు వ్యాఖ్యానించారు. బాబు ఎన్నికల సర్వేలను మేనేజ్ చేయవచ్చేమోగానీ, ప్రజలను మేనేజ్ చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. 2004, 2009 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీకే పగ్గాలు అంటూ బాబు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారని ఆయన గుర్తు చేశారు.