: ఇద్దరి ప్రాణాలు తీసిన పార్కింగ్ గొడవ
కారు పార్కింగ్ గొడవ ఇద్దరు అన్నదమ్ముల ప్రాణం తీసింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన బావానాలో కారు పార్కింగ్ విషయంలో సోదరులైన షాబాద్ సింగ్, కప్తాన్ సింగ్ లతో నేర చరిత ఉన్న రాహుల్ అలియాస్ కాలు అనే వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో ఆ అన్నదమ్ములను రాహుల్ తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరూ మరణించారని, రాహుల్ పై కేసు నమోదు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.