: తెలంగాణలో 7, సీమాంధ్రలో 3 కేంద్రీయ విద్యాలయాలు: జైరాం రమేష్
తెలంగాణలో 7, సీమాంధ్రలో 3 కేంద్రీయ విద్యాలయాలు నెలకొల్పనున్నట్టు కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. దేశంలో మొత్తం 54 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. వీటిలో సీమాంధ్ర, తెలంగాణలో పది ఏర్పాటు చేయగా, మిగిలిన 44 విద్యాలయాలను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.