: ధావన్ సెంచరీ మిస్.. టీమిండియా 200/5
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడింది. తొందరగానే రోహిత్ అవుటైనా, తరువాత దిగిన కోహ్లీ, ధావన్ కు జతకలిసి టీమిండియా ఇన్నింగ్స్ కు నిలకడ తీసుకువచ్చాడు. దీంతో 130 పరుగుల భాగస్వామ్యం వరకు నిలకడగా కొనసాగిన భారత ఇన్నింగ్స్ ను, అజంతా మెండిస్ అద్భుతమైన బంతితో కోహ్లీని బలిగొని దెబ్బతీశాడు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(48) అర్ధసెంచరీకి చేరువలో అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే నిలకడగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాడు. వీరి భాగస్వామ్యం నిలదొక్కుకుంటున్న దశలో రహానే(22) నిష్క్రమించాడు. తరువాత టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి, నిలకడగా ఆడిన శిఖర్ ధావన్(94) మెండిస్ బంతిని అంచనా వేయలేక బోల్తా పడ్డాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ ఫోర్ కొట్టి ఫర్వాలేదనిపించినా వెంటనే భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా 40 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. మరో పది ఓవర్లు, 5 వికెట్లు టీమిండియా చేతిలో ఉన్నాయి. క్రీజులో అంబటి రాయుడు(18)కు జతగా రవీంద్ర జడేజా ఉన్నాడు.