: సౌదీలో భారతీయులపై అకృత్యం...!


గల్ఫ్ దేశాల్లో భారతీయులపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. 2010లో ఐదుగురు భారతీయులను సజీవ సమాధి చేశారన్న విషయం వింటే ఒళ్ళు గగుర్పొడవకమానదు. ఓ వ్యక్తి హత్య కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారిస్తే ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. 2010లో ఖతీఫ్ అనే వ్యక్తి హత్య వ్యవహారంలో సౌదీ పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు తాము ఐదుగురు వ్యక్తులను హింసించి, బతికుండగానే ఇసుకలో పూడ్చివేశామని తెలిపారు. వారు చెప్పిన ఆధారాల ప్రకారం సంఘటన స్థలంలో తవ్వకం జరపగా, అస్థిపంజరాలు బయటపడ్డాయి. కాగా, చనిపోయినవారు భారతీయులో కాదో తేల్చుకోవాల్సి ఉందని ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అక్కడి మరణించింది భారతీయులేనని పోలీసులు లిఖితపూర్వకంగా తెలపలేదని, డీఎన్ఏ పరీక్ష నిర్వహించిన పిమ్మటే తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్ కు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు.

  • Loading...

More Telugu News