: రాష్ట్రపతి పాలనే కరెక్టు: ఆనం


ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన నిర్ణయమే సరైనదని మాజీ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు సరికాదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నేతృత్వంలో ఎన్నికల్లోకి వెళ్లి ప్రజల మన్ననలు పొందుతామని ఆయన తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంచుకునే కొత్త మార్గం గురించి తెలిశాక స్పందిస్తానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News