: పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తా: జగ్గారెడ్డి


టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా బలమైనదే కాని, రాజకీయంగా మాత్రం చాలా బలహీనమైనదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో తనను ఓడించేవారే లేరని... కేసీఆర్ వచ్చినా తనను ఓడించలేరని సవాల్ విసిరారు. హైకమాండ్ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానని చెప్పారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్... ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాకు అభినందనలు తెలుపుతూ, మార్చి 10న సంగారెడ్డి నుంచి హైదరాబాదు గన్ పార్క్ వరకు 25 వేల బైక్ లతో ర్యాలీ నిర్వహిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. లక్ష మందితో అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. కోదండరాం అమరవీరుల జాబితా ఇస్తే వెయ్యి కుటుంబాలకు పక్కా ఇళ్లు ఇప్పిస్తానని తెలిపారు. తాను సమైక్యవాదినే అయినా హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News