: సీమాంధ్రకు ఇచ్చిన హోదాపై స్థంభించిన బీహార్


రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంపై బీహార్ లోని రాజకీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్న తమను కాదని, సీమాంధ్రకు ఎలా ప్రత్యేక హోదా కల్పిస్తారని అక్కడి రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో అక్కడి రాజకీయపార్టీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించినప్పుడు తమకు ఎందుకు కల్పించరని వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసినట్టే, బీహార్ నుంచి జార్ఖండ్ ను విడదీశారని అంటున్నారు. బీహార్ కు ప్రత్యేకహోదా కల్పించే వరకు ఆందోళనలు తీవ్రం చేస్తామని, నేరుగా కేంద్రానికి తెలిసేలా తమ ఆందోళనలు ఉంటాయని అక్కడి రాజకీయపార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బంద్ ల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తమను అర్థం చేసుకోవాలని, ప్రజాప్రయోజనాల కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News