: సీఎస్ మహంతి పదవీ విరమణ నేడే.. సంతకం చేయని కిరణ్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఈ రోజు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే మహంతిని మరికొంత కాలం ఈ పదవిలో కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహంతి స్థానంలో కొత్త సీఎస్ ను నియమించే విషయంలో ప్రభుత్వం నిన్న రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 17 మంది సీనియర్ ఐఏఎస్ అధికార్ల పేర్లతో కూడిన ఫైల్ ను నిన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పంపారు. అయితే తాను అపద్ధర్మ ముఖ్యమంత్రిని కావడం వల్ల ఫైల్ పై సంతకం చేయలేనని కిరణ్ తిరస్కరించినట్టు సమాచారం. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుండటం, మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో మహంతినే కొంతకాలం పాటు పదవిలో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.