: దేశంలో బీజేపీ గాలి వీస్తోంది: టీజీ వెంకటేశ్
దేశమంతటా ఇప్పుడు బీజేపీ గాలి వీస్తోందని టీజీ వెంకటేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో చేరటానికి కారణమేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ... బీజేపీతో సత్సంబంధాలున్న పార్టీ రాష్ట్రంలో టీడీపీయేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి వల్లే సీమాంధ్ర ప్రాంతానికిచ్చిన ప్యాకేజీ కోసం బీజేపీ పట్టుబట్టిందని ఆయన తెలిపారు.