: బాల్ టాంపరింగ్ వ్యాఖ్యలపై వార్నర్ కు జరిమానా


దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ఏబీ డివిల్లీర్స్ పై బాల్ టాంపరింగ్ వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తగిన మూల్యం చెల్లించాడు. వార్నర్ పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. పోర్ట్ ఎలిజబెత్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో డివిల్లీర్స్ గ్లోవ్ లోకి బంతిని తీసుకుని దాని రూపు మార్చి ఉంటాడని, ఆ తర్వాతే బంతి విపరీతంగా రివర్స్ స్వింగ్ అయిందని వార్నర్ అనుమానం వ్యక్తం చేశాడు. ఓ దశలో పటిష్ఠంగా ఉన్న తాము, ఉన్నట్టుండి దక్షిణాఫ్రికా పేస్ ను అర్థం చేసుకోలేకపోయామని వార్నర్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలను ఖండించిన సఫారీ మేనేజ్ మెంట్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై విచారించిన మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా... వార్నర్ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించాడని తెలిపారు.

  • Loading...

More Telugu News