: గుడ్డు కాదు, కోడే ముందట!
కోడి ముందా? గుడ్డు ముందా? అన్న మీమాంస ఇప్పటిది కాదు. తార్కికుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరినీ వేధించిన ప్రశ్న ఇది. ఎట్టకేలకు ఇంగ్లండ్ పరిశోధకులు దీన్నీ ఛేదించారు. కోడే ముందని, ఇవిగో ఆధారాలంటున్నారు. గుడ్డుకు పైన ఉండే పెంకు నిర్మాణంలో ఒవోక్లెడిడైన్-17 అనే ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుందని, ఆ ప్రొటీన్ కేవలం కోడి గర్భాశయంలోనే ఉంటుందని వివరించారు. తద్వారా గుడ్డు కోడి గర్భాశయం నుంచే రూపొందుతుందని స్పష్టీకరించారు. బాహ్య వాతావరణంలో ఆ ప్రొటీన్ ఉండదని, తత్ఫలితంగా గుడ్డు కోడి కంటే ముందు ఏర్పడే అవకాశమే లేదని తేల్చేశారు. ఒవోక్లెడిడైన్-17... కాల్షియం కార్బొనేట్ ను కాల్సైట్ స్ఫటికాలలోనికి చొప్పిస్తుందని తద్వారా పెంకు నిర్మితమవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.