: మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పేయొచ్చు!
టెక్నాలజీ కాలంతో పాటు పరుగులు పెడుతోంది. తాజాగా ఓ అద్భుతమైన రక్త పరీక్ష విధానానికి పరిశోధకులు తుదిరూపునిచ్చారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్ళలో మీరు చనిపోయే ముప్పు ఉన్నదో? లేదో? చెప్పేస్తారు. సుమారు 17,000 మందిపై నిర్వహించిన ప్రయోగాల అనంతరం తూర్పు ఫిన్లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మరణం అన్నది ప్రధానంగా రక్తంలో ఉండే నాలుగు జీవపదార్థాల స్థాయిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అల్బుమిన్, ఆల్ఫా-1 ఎసిడిక్ గ్లైకోప్రొటీన్, లైపో ప్రొటీన్లు, సిట్రిక్ యాసిడ్ పదార్థాలు ప్రతి వ్యక్తి రక్తంలో ఉంటాయని, సాధారణ జీవక్రియలకు సహాయపడతాయని వివరించారు. అయితే, వాటి స్థాయులను బట్టి మనిషి మరణం ఆధారపడి ఉంటుందట. తమ విశ్లేషణ ద్వారా భవిష్యత్తులో మరణాల రేటు తగ్గింవచ్చని పరిశోధనకు నాయకత్వం వహించిన పేసీ సోయినినెన్ చెప్పారు.