: మత విశ్వాసాలను గాయపరిచేలా వ్యవహరించాడని ప్రిన్సిపాల్ పై కేసు


గడ్డం తీసేయాలని ఓ ముస్లిం విద్యార్థిని ఆదేశించిన ప్రిన్సిపాల్ చిక్కుల్లో పడ్డాడు. యూపీలోని మొరాదాబాద్ లో జరిగిందీ సంఘటన. అబ్దుల్ బాసిత్ అలీ ఖాన్ అనే ముస్లిం యువకుడు స్థానికంగా విల్సోనియా ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పరీక్షల కోసం హాల్ టికెట్ తీసుకునేందుకు కాలేజీకి వచ్చిన అలీ ఖాన్ పై ప్రిన్సిపాల్ ఏఎస్ శాంతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడ్డం తీసేసిన తర్వాతే కళాశాలలో అడుగుపెట్టాలని ఆదేశించాడు. గడ్డం తీయకపోతే హాల్ టికెట్ ఇవ్వనని కరాఖండీగా చెప్పాడు. దీనిపై అలీ ఖాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మత విశ్వాసాలను గాయపరిచేలా వ్యవహరించాడన్న ఆరోపణలపై ఆ ప్రిన్సిపాల్ పై ఐపీసీ సెక్షన్ 298 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News